మత్తు పదార్థాలను తరమి కొట్టడంలో
ప్రతి విద్యార్థి భాగస్వామ్యం కావాలి
NEWS Sep 06,2024 04:54 pm
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాలపై సీఐ శ్రీనివాస్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచిగా చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని తెలిపారు. మత్తు పదార్థాలకు మానసికంగా బానిస కావడం ద్వారా అనుకోకుండా నేరాలు చేసే అవకాశం ఉంటుందని, యువత విద్యార్థులు గంజాయి, మత్తు పదార్థాలను తరిమికొట్టడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.