రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన కనమేని ఎల్లారెడ్డి సింగారం గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. ఎల్లారెడ్డి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు అందుకున్న సందర్భంగా ఎల్లారెడ్డిపేట రేపా ఆధ్వర్యంలో రెడ్డి సామాజిక వర్గం నాయకులు ఆత్మీయ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రేపా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.