ఏపీని, తెలంగాణను ఒకేలా చూడండి
కేంద్రమంత్రికి CM రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
NEWS Sep 06,2024 04:09 pm
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణకు తక్షణ సాయంతో పాటు శాశ్వత పునరుద్ధరణ పనులకు తగిన నిధులు కేటాయించాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఏపీకి ఎలాంటి సాయం చేస్తారో తెలంగాణకూ అలాగే చేయాలని, తెలుగు రాష్ట్రాలను ఒకేలా చూడాలని కోరారు. సచివాలయంలో కేంద్రమంత్రికి వరద ప్రభావం నష్టంపై సీఎం, అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో వరదల వల్ల రూ.5,438 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. .