మనూర్ మండలం బోరంచ శివారులో సింగూరు ప్రాజెక్టు దిగువ నీరు ప్రవహించే మంజీరా నది ప్రవాహాన్ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్టోల సంజీవరెడ్డి పరిశీలించారు. మంజీరా నది ప్రవాహం దగ్గర ఉండే పంట పొలాలను ఎమ్మెల్యే సందర్శించారు. భారీగా వర్షాలు కురిసి మంజీరా నది నిండుకుండలా మారడం వలన నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. సంగమేశ్వర స్వామిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు.