ఈనెల 26న వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2022 నుండి తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలపై మంత్రి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.