ఉమ్మడి మెదక్ జిల్లా జట్ల ఎంపిక
NEWS Sep 06,2024 06:01 pm
తూప్రాన్ పట్టణంలోని సెయింట్ ఆర్నాల్డ్ హైస్కూల్ లో 9న ఉమ్మడి మెదక్ జిల్లా సబ్ జూనియర్ ఖోఖో జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ మహేందర్ రావు, పోచప్ప, నాగరాజు తెలిపారు. 13 నుంచి 15 వరకు ఖమ్మం జిల్లా కల్లూరు మినీ స్టేడియంలో 34 సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనే బాల బాలికల మెదక్ జిల్లా జట్ల ఎంపికలు చేపడుతున్నట్లు వివరించారు. వివరాలకు 98665 46563 సంప్రదించాలని సూచించారు