శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఇసుక రవాణా కోసం జిపిఎస్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు ధర్మవరం ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నూతన ఇసుక విధానంలో భాగంగా జిపిఎస్ ఉన్న వాహనాలను మాత్రమే ఇసుక రవాణకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని వాహన డ్రైవర్లు, ప్రజలు గమనించాలని సూచించారు.