ఆన్లైన్ ఆథరైజ్డ్ పొల్యూషన్ సర్టిఫికెట్లు మాత్రమే చెల్లుబాటు
NEWS Sep 06,2024 06:05 pm
మోటార్ వాహనాలకు ఆన్లైన్ ద్వారా ఆధరైజ్డ్ పొల్యూషన్ సెంటర్ జారీ చేసిన పొల్యూషన్ సర్టిఫికెట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయని ఇతర మాన్యువల్ పొల్యూషన్ సర్టిఫికెట్లు చెల్లుబాటు కాదని అమలాపురం డిటీవోడీ అశోక్ ప్రతాప్ రావు స్పష్టం చేశారు. కొంతమంది ఇంకా మాన్యువల్ సర్టిఫికెట్లుతో వాహనదారులను మోసం చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, అలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.