బేస్ బాల్ జిల్లా జట్ల ఎంపిక
NEWS Sep 06,2024 04:56 pm
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధి సెయింట్ మేరీస్ విద్యానికేతన్ హై స్కూల్ లో జిల్లా స్థాయి బేస్ బాల్ గట్ల ఎంపిక చేపట్టినట్టు అసోసియేషన్ కార్యదర్శి మధు యాదవ్, ప్రవీణ్ గౌడ్ తెలిపారు. 75 మంది బాలురు, 47 మంది బాలికలు హాజరుకాగా జిల్లా అధ్యక్షులు నిమ్మ రంగారెడ్డి ఆధ్వర్యంలో బాలుర బాలికల జట్లను 18 మంది చొప్పున ఎంపిక చేసినట్టు వివరించారు. 14 నుంచి నిర్మల్ లో రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతున్నట్లు వివరించారు.