వడ్డేపల్లి లేని లోటు తీర్చలేనిది
NEWS Sep 06,2024 05:38 pm
సిరిసిల్ల చేనేత కుటుంబంలో జన్మించి రచయితగా, పరిశోధకుడిగా, దర్శకుడిగా.. ఇలా పలు రంగాలలో విశిష్ట ప్రతిభ కనబరిచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వడ్డేపల్లి కృష్ణ చేసిన సేవలు మరువ లేనివని మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి అన్నారు. ఆయనను పలు కార్యక్రమాలలో కలిసినప్పుడు సాహిత్య రంగంలో మరింత సేవ చేయాలనే తపనవారి మాటల్లో కనిపించేదని, అలుపెరుగని గొప్పరచయిత వడ్డేపల్లి కృష్ణ భౌతికంగా మన నుండి దూరమై ఉండొచ్చు కానీవారి రచనల ద్వారా ఎప్పటికీ ప్రజల గుండెల్లో మిగిలిపోతారని కొనియాడారు.