సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ లో కవులు రచయితలు వడ్డేపల్లి కృష్ణ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కవి జూకంటి జగన్నాథం మాట్లాడుతూ.. వడ్డేపల్లి కృష్ణ మృతి చెందడం సాహితి లోకానికి తీరనిలోటని అన్నారు. పలువురు కవులు మాట్లాడుతూ.. వడ్డేపల్లి కృష్ణ సిరిసిల్ల కీర్తి పతాకను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన గొప్ప కవి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.