వడ్డేపల్లి కృష్ణకు అశ్రునివాళులు
NEWS Sep 06,2024 05:43 pm
సిరిసిల్లకు చెందిన ప్రముఖ కవి సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ హఠాన్మరణం పొందడం పట్ల పలువురు సాహితీవేత్తలు, రచయితలు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణకు అశ్రునివాళులు అర్పించారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ.. విద్యార్థి దశలోనే వడ్డేపల్లికృష్ణ అనేక కవితలు రాసి నాటకాలు వేసి అందరికీ ఆదర్శప్రాయుడుగా నిలిచిన గొప్ప కవి అని కొనియాడారు.