కాకినాడలో శుక్రవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జగ్గంపేట జడ్పీటీసీ ఒమ్మి బిందుమాధవి మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జగ్గంపేట మండలంలో సుమారు 500 ఎకరాల పంట నీట మునిగి నష్టం వాటిల్లిందన్నారు. ఆ రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు.