సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామానికి చెందిన దేవేందర్(30) మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి సాయంత్రం అయినా ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు గాలించిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో సారంగాపూర్ పోలీస్ స్టేషన్లో తండ్రి దేవన్న ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు స్వర్ణ వాగులో వెతికిచూడగా గురువారం అతని మృతదేహం లభ్యమైంది.