ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
NEWS Sep 06,2024 02:00 pm
తిరుమలపూర్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బి.జ్యోష్ణదేవి ఆద్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భముగా ఉపాద్యాయ దినోత్సవం ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులను విద్యార్థులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.జ్యోష్నదేవి, ఉపాద్యాయులు సాయిని ఐలయ్య, ఉప్పాల నాగరాజు, లక్ష్మీ నారాయణ, ఏనుగు ఆదిరెడ్డి, ఫహీం, బాలరాజు, ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవరాజం, సిఆర్పి ఒడ్నాల సాయి, విద్యార్థులు పాల్గొన్నారు.