ఎవరీ మహేశ్ కుమార్ గౌడ్?
NEWS Sep 06,2024 12:57 pm
కొత్త పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్వగ్రామం నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ మండలం, రహత్‌నగర్. విద్యార్థి దశలో NSUI ప్రధాన కార్యదర్శిగా, 1986లో జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కార్యదర్శిగా, 2013లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా, పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, 2018 కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా, 2021 పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2023 టీ-పీసీసీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా, 2024 జనవరిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు.