అట్రాసిటీ కేసులు సత్వరం పరిష్కరించాలి
NEWS Sep 06,2024 02:03 pm
సిరిసిల్ల: ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఎంక్వైరీ వేగంగా పూర్తిచేసి చార్జీ షీట్ వేస్తే బాధితులకు న్యాయంతో పాటు ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం అందుతుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్, అదనపు ఎస్పీ చంద్రయ్య పాల్గొన్నారు.