TG: మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో వేద పండితులతో నవగ్రహ మహాయాగం చేపట్టారు. తన సతీమణి శోభతో కలిసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత భవిష్యత్, శ్రేయస్సు కోసం వేద పండితుల సూచన మేరకు తాజాగా యాగం చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. 2015లో KCR చండీయాగం, 2018, 2024లో రాజశ్యామల యాగం చేపట్టారు.