బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తెరంగేట్రం చేశారు. ఈ సందర్భంగా తన తమ్ముడికి జూ. ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు అంటూ X వేదికగా గ్రీటింగ్స్ తెలిపారు. నీ జీవితంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతున్న తరుణంలో తాత గారితో పాటు అన్ని దైవిక శక్తుల ఆశీర్వాదాలు నీపై కురవాలని కోరుకుంటున్నానని చెప్పారు. అలాగే మోక్షజ్ఞకు తారక్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోక్షజ్ఞ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను షేర్ చేశారు.