ఇటీవల విజయవాడ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన నిర్విరామంగా కొనసాగింది. పలు మార్లు జేసీబీ ఎక్కి గంటలు గంటలుగా వరద ప్రభావిత కాలనీలను పరిశీలించారు. ఏడు పదుల వయస్సులోనూ చంద్రబాబు ఎంతో యాక్టివ్‌గా బాధితులను కలుసుకుంటూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.