బాలకృష్ణ నట వరసుడిగా మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం చేశారు. హనుమాన్ మూవీ ఫేం ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో నేడు మోక్షజ్ఞ పుట్టిన రోజు కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘సింబా ఈజ్ కమింగ్’ అంటూ Xలో పోస్ట్ పెట్టారు. "నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజను ప్రత్యేక హక్కుతో పరిచయం చేయడం గొప్ప ఆనందాన్ని ఇస్తోంది.. జన్మదిన శుభాకాంక్షలు మోక్షూ.. అందరి నమ్మకానికి, ఆశీస్సులకు బాలకృష్ణకి ధన్యవాదాలు" అని తెలిపారు.