కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారిపై ఉన్న బావుపేట కల్వర్టు రోడ్డు ప్రమాదకరంగా మారిందని, రోడ్డుపై గుంతల కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కొత్తపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పంజాలస్వామి గౌడ్ అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారిని నిర్లక్ష్యం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిరిపురం నాగప్రసాద్, గ్రామ శాఖ అధ్యక్షులు ఆరే మల్లేశం గౌడ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.