దళారులకు అడ్డుకట్ట వేసేందుకు భక్తులకు లడ్డూలను అందుబాటులోకి తెచ్చేందుకు టీటీడీ ఆలయాల్లో లడ్డూలు విక్రయిస్తున్నారు. పలు టీటీడీ ఆలయాలతోపాటు హైదరాబాద్ హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్‌లో ఉండే వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో రూ. 50కి లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుంది. నిత్యం ఉ. 9 గంటల నుంచి సా. 5 గంటల వరకు ప్రసాదాన్ని విక్రయిస్తారు.