వైసీపీని వీడుతున్న ముఖ్యనేతలు
NEWS Sep 06,2024 06:31 am
వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఏలూరు జిల్లాకు చెందిన ముఖ్య నేతలుమాజీ మంత్రి ఆళ్ల నాని, ఏలూరు కార్పొరేషన్ ఛైర్మన్, కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేశారు. వీరిలో ఏలూరు కార్పొరేషన్ ఛైర్మన్, కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు పార్టీకి రాజీనామా చేశారు. తాము జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.