హైదరాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌లు దందా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్‌లోని ఓ పార్లర్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించడంతో ఈ ఐస్‌క్రీమ్‌ల గుట్టురట్టయ్యింది. రోడ్డు నెంబరు 1 లో వన్ అండ్ ఫైవ్ పార్లర్‌లో ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించగా.. విస్కీ ఐస్‌క్రీమ్‌లు బయటపడ్డాయి. ఐస్‌క్రీమ్‌లో పేపర్ విస్కీ కలిపి అమ్ముతున్నట్టు గుర్తించారు.