పోషణ మాసం పోస్టర్లను ఆవిష్కరించిన
కలెక్టర్ ఆశీష్ సంగ్వన్
NEWS Sep 06,2024 05:52 am
KMR: మహిళలు పిల్లలు వికలాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ చేతుల మీదుగా పోషణ మాసం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడేళ్ల లోపు వయసున్న పిల్లలకు మెదడు ఎదుగుదలకు సరైన పోషణ అవసరం, సరైన పోషణ లేకుంటే మెదడు ఎదుగుదల మందగిస్తుందన్నారు. ఈ వయసు గల చిన్నారుల పోషణ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.