నిర్మల్: చికిత్స పొందుతూ బాలిక మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఖానాపూర్ పట్టణానికి చెందిన ఉత్తర (12)ను అనారోగ్య కారణాలతో కుటుంబీకులు 3 రోజుల క్రితం నిర్మల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. కాగా చికిత్స పొందుతూ ఆమె నిన్న మృతి చెందింది. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే బాలిక మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు.