అక్రమ కట్టడాలపై మంత్రి ఆదేశాలు
NEWS Sep 06,2024 08:02 am
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో చెరువులు, కుంటలు, వాగులు ఇతర జలాశయాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను గుర్తించి, వాటి పూర్తి వివరాలతో వెంటనే నివేదిక ఇవ్వాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల పునరుద్ధరణ కోసం తక్షణావసరంగా రూ. 24కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సచివాలయంలో తమ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, కమిషనర్ అనితా రామచంద్రన్‌లతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.