మాజీ ఎమ్మెల్యే రవిశంకర్‌పై ఎమ్మెల్యే సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి విడుదల చేయాలని దీక్ష చేపడుతామని దొంగ మాటలు కాదని ఇన్నేళ్లుగా ఎమ్మెల్యే గా పని చేసిన రవిశంకర్ చేసిన అభివృద్ధి పనులపై శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు. కమిషన్లు ఇస్తేనే ట్రాన్స్ఫర్ పదవులు ఇచ్చిన రవిశంకర్ కు మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. ఇప్పటికే ప్రజలు బుద్ధి చెప్పారు. త్వరలోనే అన్ని రంగాలలో మీరు చేసిన అక్రమాలు బయటికి తీస్తా అనిహెచ్చరించారు. నియోజకవర్గంలో బ్రిడ్జి కుంగి పోయిన పట్టింపే లేదన్నారు.