అరకు: అరకులోయ పట్టణంలోని వినాయక మండపాలను అరకు సిఐ ఎల్ హిమగిరి, ఎస్ఐ ఆర్ సంతోష్ రాత్రి పరిశీలించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ... ప్రజలకు, ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన భాద్యత వినాయక మండపాల నిర్వాకులపై ఉందని సూచించారు. మండపాలకు పోలీసు పర్మిషన్లు తప్పని సరిగా పొందాలన్నారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా వినాయక చవితి సంతోషంగా చేసుకోవాలని సిఐ, ఎస్ఐ లు కోరారు.