ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
NEWS Sep 05,2024 06:29 pm
జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మల్యాల సిఐ నీలం రవి, ఎస్సై నరేష్ కుమార్ లు స్థానిక పోలీస్ స్టేషన్లో గణేష్ మండపాల నిర్వాహకులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, గణేష్ ఉత్సవాల నుండి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని మండపాల నిర్వాహకులకు సూచించారు..