మాత శిశు మరణాలను అరికట్టండి
NEWS Sep 05,2024 06:31 pm
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా వైద్య అధికారులతో కలెక్టర్ టీఎస్ చేతన్ సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 2023 నుంచి 2024 వరకు 5 మాతృ మరణాలు,
32 శిశు మరణాలు సంభవించడం దారుణమన్నారు. ప్రతి మరణానికి కారణాలు క్షుణ్ణంగా విశ్లేషించాలన్నారు. వైద్యశాలలో అన్ని సదుపాయాలు కల్పించిన తీరు మారలేదు అన్నారు. కార్యక్రమంలో సంబంధిత వైద్య అధికారులు పాల్గొన్నారు.