తెలంగాణ నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీపికబురు వినిపించారు. ఇప్పటికే 11 వేల 62 పోస్టులతో డీఎస్సీ పరీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి సర్కార్.. త్వరలోనే మరో డీఎస్సీ నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం ప్రకటించారు. త్వరలో.. 6 వేలకు పైగా పోస్టులతో మరో డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. ఇప్పటికే నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఫలితాలను మరో వారం రోజుల్లో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.