ధృక్ సిద్ధాంతం ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీ శనివారం రోజు వినాయక చవితి నిర్వహించుకోవాలని పండితులు సూచిస్తున్నారు. వినాయక చవితి రోజు ఉదయం 11:03 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్యలో ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చంటున్నారు. ఉదయం పూజ చేసుకోలేని వారు సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఆ సమయం సాయంత్రం 6:22 గంటల నుంచి రాత్రి 7:30 గంటల మధ్యలో వరసిద్ధి వినాయక వ్రత కల్పం చేసుకోవచ్చని చెబుతున్నారు.