పోడు భూముల కేసులు ఎత్తివేయాలి
NEWS Sep 05,2024 05:10 pm
గిరిజనులపై ఉన్న పోడు భూముల కేసులను ఎత్తివేయాలని లంబాడీల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు బానోతు నరేష్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరేష్ నాయక్ మాట్లాడుతూ.. 2005 నుండి 2022 వరకు గిరిజనులపై పోడు భూముల కేసులను ఎత్తివేస్తామని బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, ఆ హామీ ఇంతవరకు కూడా అమలుకు నోచుకోలేదని అన్నారు. కేసులు గిరిజన రైతులకు ఆర్థిక, సామాజిక నష్టాన్ని కలిగిస్తూ, వారి మౌలిక హక్కుల ఉల్లంఘనకు దారితీస్తున్నాయని తెలిపారు.