సీఎం రేవంత్‌కు మంచు విష్ణు విజ్ఞప్తి
NEWS Sep 05,2024 04:06 pm
జస్టిస్ హేమ కమిటీ నివేదిక మలయాళ సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలోనే మా అధ్యక్షులు మంచు విష్ణు తెలంగాణ సీఎంకు ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళల భద్రత, రక్షణను మరింత మెరుగుపరచడం కోసం వారి తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు మంచు విష్ణు.