ఆటో డ్రైవర్లకు సిఐ కౌన్సిలింగ్
NEWS Sep 05,2024 04:15 pm
పెనుకొండ: శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో ఆటో డ్రైవర్లకు సీఐ రాఘవన్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. పరిమితికి మించి ప్రయాణికులను తరలించ వద్దన్నారు. ప్రతి ఆటో డ్రైవర్ లైసెన్స్, ఆటో ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అని అన్నారు.