ఈనెల 10వ తేదీ నుంచి బ్యాడ్మింటన్ పోటీలు
NEWS Sep 05,2024 04:11 pm
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ అండర్-15 బాలబాలికల ఛాంపియన్షిప్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా బ్యాడ్మింటన్ సమైక్య అధ్యక్షుడు బుచ్చయ్య చౌదరి తెలిపారు. పట్టణంలోని ఎంపీఆర్ బ్యాట్మెంటన్ అకాడమీ ఇండోర్ స్టేడియం, మంజు బ్యాడ్మింటన్ అకాడమీలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రముఖ క్రీడాకారులు పాల్గొననున్నారని తెలిపారు.