సంగారెడ్డి చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చెరువు నుండి అలుగు పారుతుండడంతో కొంత గుర్రపు డెక్క కొట్టుకుపోయింది. మిగిలిన గుర్రపు డెక్కను మత్స్యకారులకు ఇబ్బంది కలగకుండా భారీ యంత్రం సహాయంతో తొలగిస్తున్నారు. గుర్రపు డెక్క తొలగింపు పనులను మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వయంగా పరిశీలించారు.