టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా రాజకీయాల్లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. జడేజా భార్య రివాబా జడేజా గుజరాత్‌లోని జామ్‌నగర్ ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే. తాజాగా జడ్డూ కూడా బీజేపీలో చేరాడు అంటూ రివాబా జడేజా బీజేపీ సభ్యత్వ ధ్రువీకరణ పత్రాల ఫోటోలను పోస్ట్ చేసింది.