ఉన్నతాధికారులతో కలెక్టర్ సమీక్ష
NEWS Sep 05,2024 04:17 pm
సిరిసిల్ల: సదరమ్ శిబిరంలో వైకల్యం నిర్థారణ పరీక్షల కోసం మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నిర్ణీత సమయానికి రావాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సదరమ్ శిబిరం నిర్వహణపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సిరిసిల్లలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, వేములవాడ ఏరియా హాస్పిటల్ లో ఈ నెల10న,13న,18న, 20న నిర్వహించనున్నట్లు తెలిపారు.