పగలు తాళం వేసిన ఇళ్లను చూసి రాత్రిపూట చోరీలకు పాల్పడిన సూర్యాపేట జిల్లా కరక్కాయల గూడెం గ్రామానికి చెందిన సన్నిధి ఆంజనేయుల అలియాస్ అంజి (30) అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ చంద్రయ్య తెలిపారు. కొండాపూర్ పోలీస్ స్టేషన్లో చోరీ వివరాలను తెలిపారు. మల్కాపూర్ చౌరస్తా వాహన తనిఖీల్లో పట్టుబడిన ఆంజనేయుల నుంచి 14.8 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితుడిని పట్టుకున్న 18 మంది పోలీసులకు నగదు రివార్డులను అందజేశారు.