మేముసైతం అంటున్న టాలీవుడ్
NEWS Sep 05,2024 02:46 pm
తెలుగు రాష్ట్రాలకు సాయం చేస్తామంటూ టాలీవుడ్ ముందుకు వచ్చింది. ఆర్థిక సాయంతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. 2 తెలుగు రాష్ట్రాలలోని ఆయా థియేటర్ల వద్ద విరాళాల కోసం, వస్తువుల సేకరణ కోసం కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ 2 తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.25 లక్షలు, తెలుగు నిర్మాతల మండలి చెరో రూ.10 లక్షలు, ఫిల్మ్ ఫెడరేషన్ ఇరు రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.