రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బాబానాయక్ తండాకు చెందిన మార్సకోల గుణవంత్రావ్ మాడావి సంతోష్ ఇద్దరు కలిసి బైక్ పై జన్నారంకు అంత్యక్రియలకు వెళుతుండగా గండి పోచమ్మ ఆలయం ఉడుంపూర్ మధ్యలో గల రోడ్డుపై ఎదురుగా వెళ్తున్న వాహనాన్ని ఢీకొనగా బైక్ పై వెనకాలే కూర్చున్న సంతోష్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.