ఆదివాసి మహిళపై అత్యాచారం చేసి దాడి చేసిన నిందితున్ని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బర్కం వెంకట లక్ష్మి నవీన్ యాదవ్ డిమాండ్ చేశారు. సిరిసిల్లలోని అంబేద్కర్ చౌక్ వద్ద బిజెపి మహిళా మోర్చా నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకట లక్ష్మి మాట్లాడుతూ 31న ఆసిఫాబాద్ లో ఆదివాసి మహిళపై ఓ వర్గానికి చెందిన ఆటో డ్రైవర్ అత్యాచారం చేసి దాడి చేశారని తెలిపారు. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమని అన్నారు.