కత్తి వెంకటస్వామిని సత్కరించిన
కరీంనగర్ బార్ అసోసియేషన్
NEWS Sep 05,2024 04:21 pm
కరీంనగర్ పర్యటనలో హైకోర్టు న్యాయవాది డా. కత్తి వెంకటస్వామిని కరీంనగర్ బార్ సోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కత్తి వెంకటస్వామి విద్యా సదస్సుపై మేధావులంతా ఏకం కావాలని పోస్టర్ ఆవిష్కరించి అసోసియేషన్ న్యాయవాదులను కోరారు. టీ-పీసీసీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా ఉన్న కత్తి వెంకటస్వామి న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.