సిరిసిల్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ మంచె శ్రీనివాస్‌కు సంబందించిన బిల్డింగ్ సెల్లార్‌ను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. గోపాల్ నగర్ లో వైస్ ఛైర్మన్ బిల్డింగ్ లో నిబందనలకు విరుద్దంగా అక్రమంగా సెల్లార్ లో కమర్షియల్ షెట్టర్ లు వేసి, తమ ఇంటి గోడను ఆనుకుని, అక్రమంగా టాయిలెట్ లు కట్టారని, ఇంటి యజమానితో పాటు మరో స్థానికుడు హైకోర్ట్ ను ఆశ్రయించారు. హైకోర్ట్ అక్రమంగా నిర్మించిన వాటిపై చర్యలు చేపట్టాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో మున్సిపల్ అధికారులు సెల్లార్ కూల్చివేశారు.