సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్మల్ పట్టణంలోని స్థానిక ఆర్కే కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు విద్యార్థులకు పాఠశాల దశ అత్యంత కీలకమైనదని విద్యార్థులను చదువుతోపాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దాలన్నారు.