జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం ఎన్నికలు జరగగా ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎక్కల్ దేవి రామచంద్రంను వారి వంశీయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా రామచంద్రం మాట్లాడుతూ.. కుల సంఘ ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించిననా పద్మశాలి కుల బాంధవులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి నుండి పద్మశాలి సంఘం దేవాలయ కమిటీ అభివృద్ధికి నా శాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.