పెద్దపల్లి లోని మాతా శిశు ఆసుపత్రి సేవలు పకడ్బందీగా నిర్వహిస్తున్నారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలో ఇటీవల సిజేరియన్ ఆపరేషన్లు సక్రమంగా జరిపి తల్లి బిడ్డ ప్రాణాలు రక్షించడంలో డాక్టర్ల పాత్ర చాలా అమూల్యమైనదని అన్నారు. దొంగతుర్తి గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన మౌనిక భర్త సంపత్ ఆగస్టు 24న రక్తకణాలు 70వేలతో అడ్మిట్ అవగా పేషెంట్ కు కావలసిన అన్ని జాగ్రత్తలు ప్లేట్లెట్స్ ప్లాస్మా ట్రాన్స్ ఫ్యూజ్ చేసి ఆపరేషన్ చేయడం జరిగింది.